: భూసేకరణ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిద్దాం: సీడబ్ల్యూసీ తీర్మానం


నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ముగిసిన ఆ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. వరుస పరాజయాలపై పార్టీలో సుదీర్ఘంగా చర్చించిన కమిటీ పార్టీలో సంస్థాగత మార్పులకూ పచ్చజెండా ఊపింది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరిన్ని బాధ్యతలు అప్పగించేందుకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోనుందన్న వాదన వినిపించినా, ఆ దిశగా చర్చించిన దాఖలాలు కనిపించలేదు.

  • Loading...

More Telugu News