: ప్రధాని అపాయింట్ మెంట్ కూడా సాధించలేకపోతే... కేసీఆర్ వేస్టే: జీవన్ రెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీకాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏడు నెలల పాలనలో అసెంబ్లీ తీర్మానాలు తప్ప, తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఏపీలోని కృష్ణపట్నం నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాను తీసుకురావడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. విద్యుత్ వాటా గురించి ప్రధాని మోదీపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని మండిపడ్డారు. ప్రధాని అపాయింట్ మెంట్ కూడా సాధించలేకపోతే... ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి కేసీఆర్ అనర్హుడని అన్నారు.

  • Loading...

More Telugu News