: కేటీఆర్ వద్దకు చేరిన చక్రి కుటుంబ పంచాయితీ
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దివంగత చక్రి కుటుంబసభ్యుల పంచాయితీ చివరకు టీఎస్ మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. ఈ రోజు కేటీఆర్ ను చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్ నారాయణ్, సోదరి కృష్ణప్రియ కలిశారు. చక్రి మరణానంతరం ఆయన భార్య శ్రావణికి, ఆయన తల్లి, సోదరుడికి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో, ఉభయులూ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నారు. విషప్రయోగంతో చక్రిని చంపేశారని ఒకరిపై మరొకరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, కేటీఆర్ ను చక్రి తల్లి, సోదరుడు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మా సోదరుడు చక్రి మరణంపై విచారణ జరిపించాల్సిందిగా కేటీఆర్ ను కోరామని ఈ సందర్భంగా కృష్ణప్రియ తెలిపారు.