: పాకిస్థాన్ కు అమెరికా మద్దతు ఉంటుంది: జాన్ కెర్రీ
పాకిస్థాన్ కు అమెరికా మద్దతు ఉంటుందని విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ స్పష్టం చేశారు. ఇస్లామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, భారత్, పాకిస్థాన్ లు చర్చల ప్రక్రియను కొనసాగించాలని అన్నారు. తాలిబన్లు, లష్కరే తాయిబా వంటి ఉగ్రవాద సంస్థల వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని ఆయన తెలిపారు. ఉగ్రవాదం వల్ల పాక్ కే కాదు, పొరుగు దేశాలతో పాటు అమెరికాకు కూడా ముప్పు ఉందని ఆయన చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్థాన్ తో కలిసి అమెరికా నడుస్తుందని ఆయన పేర్కొన్నారు.