: మాది అభివృద్ధి విజన్, వైకాపాది దోపిడీ విజన్: యనమల
వైకాపా అధినేత జగన్ పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. జగన్ దోపిడీకి పాల్పడ్డారు కనుకనే కేసులను ఎదుర్కొంటున్నారని, జైలు జీవితం కూడా గడిపారని సెటైర్ విసిరారు. ఆయన వల్ల పక్కనున్న వారు కూడా కేసుల్లో ఇరుక్కున్నారని విమర్శించారు. మళ్లీ ఎన్నటికైనా జగన్ జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సింది పోయి... తన పత్రికలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీది అభివృద్ధి విజన్ అయితే, వైకాపాది దోపిడీ విజన్ అని ఎద్దేవా చేశారు. వైకాపా అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో ఏమీ మిగలదని, సర్వం దోచేసుకుంటారని అన్నారు.