: రాహుల్ కే బాధ్యతలు అప్పగిస్తారా?... సీడబ్ల్యూసీ భేటీ


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన 10 జన్ పథ్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ నడుస్తోంది. ఏఐసీసీ చీఫ్ గా రాహుల్ నియామకం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా తదితర అంశాలపై కాంగ్రెస్ పెద్దలు చర్చిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్, రెండో జాబితాపై మల్లగుల్లాలు పడుతోంది. షీలా దీక్షిత్ ను పక్కనపెట్టే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సోనియా, అసెంబ్లీలో నామమాత్రపు ప్రాతినిధ్యం కాకుండా, కొన్ని సీట్లు గెలుచుకునైనా సత్తాచాటాలని భావిస్తున్నారు. అలాగే భూసేకరణ అంశంపై పార్లమెంటు లోపల, బయట అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ఎన్నికల వైఫల్యం నేపథ్యంలో ఆఫీస్ బేరర్ల నియామకంపై కూడా చర్చిస్తున్నారు. కాగా, ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, చిదంబరం, అహ్మద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News