: కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కుమార్తె ఓటమి
కేంద్ర మాజీ మంత్రి, టీకాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణకు మరో పరాభవం దక్కింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో ఆయన కుమార్తె సుహాసిని ఓటమిపాలయ్యారు. ఆమెపై టీఆర్ఎస్ అభ్యర్థి కేశవరెడ్డి విజయకేతనం ఎగురవేశారు. మరో వార్డులో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారు. మరో వార్డులో కూడా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి విజయం వైపు దూసుకుపోతున్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ, గెలుపొందిన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులంతా మళ్లీ టీఆర్ఎస్ లోనే చేరుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.