: నలుగురు పిల్లల్ని కనాలన్న... సాక్షి మహారాజ్ కు షోకాజ్ నోటీసులు


కేంద్రంలో అధికార బీజేపీకి తలనొప్పిగా పరిణమించిన సాక్షి మహారాజ్ దూకుడుకు కళ్లెం వేసేందుకు ఆ పార్టీ అధిష్ఠానం నడుం బిగించింది. తాజాగా ప్రతి హిందూ స్త్రీ నలుగురు పిల్లలను కనాలని పిలుపునివ్వడంతో కేంద్రంపై ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడ్డాయి. ప్రధాని కొత్త జనాభా పెరుగుదల పాలసీ గురించి బయటపెట్టాలని డిమాండ్ చేశాయి. దీంతో భవిష్యత్ లో ఇలాంటి తీవ్రవ్యాఖ్యలు ఎవరూ చేయకుండా ఉండేందుకు సాక్షి మహారాజ్ పై చర్యలకు బీజేపీ ఉపక్రమించింది. దీంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలంటూ బీజేపీ అధిష్ఠానం వివరణ కోరింది.

  • Loading...

More Telugu News