: క్వార్టర్ ఫైనల్ నుంచే అసలైన పోరు: మైక్ హస్సీ
ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ గాయం నుంచి కోలుకునేందుకు మరింత సమయం కావాలని ఆసీస్ మాజీ క్రికెటర్ మైకేల్ హస్సీ అభిప్రాయపడ్డాడు. క్లార్క్ కు మరో రెండు నుంచి మూడు వారాల విశ్రాంతి అవసరమని ఆయన పేర్కొన్నాడు. ప్రపంచకప్ ఆరంభంలో అద్భుతాలు చేయాల్సిందే లేదని, అసలు పోటీ క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్లోనే ఉంటుందని హసీ పేర్కొన్నాడు. ఆటగాడిగా, కెప్టెన్ గా క్లార్క్ సేవలు చాలా అవసరమని ఆయన తెలిపాడు. లీగ్ మ్యాచ్ లకు క్లార్క్ అందుబాటులో లేకపోయినా పర్వాలేదని ఆయన సూచించాడు. కాగా, క్లార్క్ ఫిబ్రవరి 21 లోపు తన ఫిట్ నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది. వరల్డ్ కప్ ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.