: సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రిస్ గేల్


వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ కి సెలక్టర్లు ఆగ్రహం తెప్పించారు. క్లైవ్ లాయిడ్ సారథ్యంలోని సెలెక్టర్ల నిర్ణయాన్ని గేల్ తప్పుపట్టాడు. అత్యుత్తమ ఆల్ రౌండర్లు బ్రేవో, పొలార్డ్ లేకుండా వరల్డ్ కప్ ఎలా తెస్తామని గేల్ సెలెక్టర్లును ప్రశ్నించాడు. బ్రేవో తనతో మాట్లాడుతూ, వచ్చే వరల్డ్ కప్ ను సాధించేందుకు అత్యుత్తమ జట్టును తయారు చేశారని అన్నాడని, అంటే ఈ వరల్డ్ కప్ కు ప్రాధాన్యత లేదా? అని గేల్ నిలదీశాడు. బ్రేవో, పొలార్డ్ ఎందుకు జట్టులో చోటు కోల్పోయారో సెలెక్టర్లు చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించాడు. ఈ నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులు తనకు తెలియనప్పటికీ ఇది అత్యంత చెత్త నిర్ణయమని గేల్ స్పష్టం చేశాడు. విండీస్ క్రికెట్ ఎటువెళ్తోందో తనకు తెలియడం లేదని గేల్ ఆవేదన వ్యక్తం చేశాడు. వన్డే ఫార్మాట్ లో వారిద్దరూ విజయాన్ని ప్రభావితం చేయగలరని గేల్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News