: గల్ఫ్ పర్యటనకు వెళ్లనున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గల్ఫ్ పర్యటన ఖరారైంది. ఈ నెల 18 నుంచి 22 వరకు గల్ఫ్ లో పర్యటించాలని కేసీఆర్ నిర్ణయించారు. దుబాయ్ లోని తెలుగు సంఘాల ఆహ్వానం మేరకు ఆయన దుబాయ్, షార్జా తదితర ప్రాంతాలను చుట్టిరానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ప్రాథమిక షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఆయన గల్ఫ్ దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. అలాగే అక్కడి తెలంగాణ కార్మికులను కలిసి, వారి సమస్యలు తెలుసుకుంటారు. కేసీఆర్ కు చైనా, అమెరికా దేశాల నుంచి కూడా ఆహ్వానాలు అందినట్టు సమాచారం. దుబాయ్ పర్యటన తరువాతే ఇతర అంశాలు నిర్ణయించనున్నారు.