: తెలంగాణలో భారీఎత్తున ఐఏఎస్ ల బదిలీలు
తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున బదిలీలు చేపట్టింది. సీనియర్ అధికారులు సహా 22 మంది ఐఏఎస్‌లకు తెలంగాణ ప్రభుత్వం పోస్టింగులిచ్చింది. ఈ మేరకు గత అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం అర్ధరాత్రి కూడా కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగులివ్వడం తెలిసిందే. వాటిలో తాజాగా మార్పుచేర్పులు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. సీనియర్ అధికారి రాజేశ్వర్ తివారీని పర్యావరణం, అటవీ, శాస్త్రసాంకేతికశాఖల ముఖ్యకార్యదర్శిగా నియమించింది. అధర్ సిన్హాను సీసీఎల్‌ఏ ప్రత్యేక కమిషనర్‌గా నియమించింది. అలాగే పలు మార్పులతో తాజా జాబితా విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.