: ప్రపంచ కంపెనీలన్నీ ఏపీ రాజధానిలో పెట్టుబడులు పెడతాయి: బాబు
ప్రపంచ కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి 15 నాటికి ఈ ప్రణాళిక ఓ రూపానికి వస్తుందని అన్నారు. జూన్ మొదటి వారానికి రాజధాని కోసం బృహత్ ప్రణాళిక సిద్ధమవుతుందని ఆయన వెల్లడించారు. 8 వేల ఎకరాల్లో రాజధాని బృహత్ ప్రణాళిక సిద్ధమవుతుందని ఆయన తెలిపారు. రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిస్తామని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.