: ప్రముఖ నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్రప్రసాద్ కన్నుమూత


ప్రముఖ నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్ర ప్రసాద్ (82) కన్నుమూశారు. హైదరాబాదులోని ఇషా ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరిన రాజేంద్ర ప్రసాద్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. వీబీ రాజేంద్రప్రసాద్ కు ముగ్గురు కుమారులు. వారిలో ప్రముఖ నటుడు జగపతిబాబు ఒకరు. జగపతి ఆర్ట్స్ బ్యానర్ పై రాజేంద్ర ప్రసాద్ పలు సినిమాలను నిర్మించారు. 1932 నవంబర్ 4న కృష్ణా జిల్లాలో జన్మించిన రాజేంద్రప్రసాద్ కు ఆథ్యాత్మిక చింతన మెండు. అన్నపూర్ణ సినిమాతో చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన, తెలుగులో మేటి నిర్మాతల్లో ఒకరుగా పేరుగాంచారు. ఆయన నిర్మించిన అంతస్తులు సినిమాకు జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది. అన్నపూర్ణ, ఆరాధన, అంతుస్తులు, అక్కాచెల్లెళ్లు, ఆత్మబలం, దసరాబుల్లోడు, కిల్లర్, రామకృష్ణులు వంటి 30 సినిమాలను రాజేంద్రప్రసాద్ నిర్మించారు. కాగా, వీబీ రాజేంద్ర ప్రసాద్ దసరాబుల్లోడు సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించారు. ఆయన సినీ ప్రస్థానంలో అక్కినేని నాగేశ్వరరావుతో ఎక్కువ సినిమాలు నిర్మించారు. తన కుమారుడు జగపతిబాబును కూడా ఆయనే సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. కాగా, ఆయన ఆకస్మిక మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది.

  • Loading...

More Telugu News