: ఏడు వందల యూదు పాఠశాలలకు భద్రత
ఫ్రాన్స్ లో ఉన్న 700 యూదు పాఠశాలలకు ప్రభుత్వం భద్రత కట్టుదిట్టం చేసింది. యూదు పాఠశాలలకు భద్రకల్పించేందుకు 500 భద్రతా దళాలను వినియోగిస్తోందని ఫ్రాన్స్ ప్రధాని మాన్యుల్ వాల్స్ తెలిపారు. పారిస్ లో గత వారం జరిగిన కాల్పుల కలకలం తరువాత యూదు పాఠశాలలకు భద్రత పెంచుతామని విద్యార్థుల తల్లిదండ్రులకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి బెర్నాడ్ కాజెన్యూ మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి భద్రతను పెంచారు. యూదులను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.