: ఆన్ లైన్లో కోళ్లు...సంక్రాంతికి సాంకేతికత


ఆంధ్రాలో సంక్రాంతి సందడి మొదలైంది. కృష్ణా, గోదావరి జిల్లాల్లో కోడి పందేల హడావుడి ఊపందుకుంది. ఈ సమయంలో పందెంకోళ్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మాంచి పందెం కోడి దొరకాలే కానీ.. ఎంత ఖర్చు పెట్టైనా సొంతం చేసుకునేందుకు పందెంరాయుళ్లు వెనుకాడరు. ఈ క్రేజ్ కు అందివచ్చిన సాంకేతికతను వాడుకుంటున్నారు కొందరు వ్యాపారులు. పందెం కోళ్ల ఫోటోలు ఆన్‌లైన్‌లో పెట్టి మరీ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఓఎల్ ఎక్స్, క్వికర్‌ వంటి పాత వస్తువులను అమ్మే వైబ్ సైట్లలో కొద్దిరోజులుగా పందెం కోళ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, పర్లా ఇలాంటి రకాల జాతుల పుంజుల్ని నెట్ లో అమ్మకానికి పెడుతున్నారు పందెం రాయుళ్లు. ఒక్కో పుంజును 5 వేల నుంచి 50 వేల రూపాయల ధరపలకడం విశేషం. ఈ పరిణామాన్ని పందెం రాయుళ్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి పుంజుల కోసం కిలోమీటర్ల కొద్దీ తిరిగే బదులు.. నెట్ ఓపెన్ చేసుకుని కావలసిన పుంజును సెలక్టు చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News