: కోడ్ సంక్రాంతి సంబరాలకు ఆటంకం కాదు: భన్వర్ లాల్
ఎన్నికల నియమావళి ఎల్లుండి అంటే జనవరి 14 నుంచి అమలులోకి రానుంది. దీంతో సంక్రాంతి సంబరాలకు ఆటంకం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వారి అనుమానాలకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ సమాధానమిచ్చారు. రాజకీయాలకు తావులేని సంక్రాంతికి ఎలాంటి ఆటంకం కలగదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి ఎన్నికల కోడ్ మొత్తం జిల్లాకు వర్తిస్తుందని ఆయన తెలిపారు. పండగలో రాజకీయ ప్రసంగాలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.