: అరవై సీట్లే లక్ష్యం: బీజేపీ
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యమని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 2013 ఎన్నికల్లో ఆప్ ఎనిమిది మంది కాంగ్రెస్ అభ్యర్థుల సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కేవలం 49 రోజుల్లోనే మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజీనామా చేశారని ఆయన తెలిపారు. ఇప్పుడు ఎవరితోనూ పొత్తు పెట్టుకునే అవకాశం లేకుండా రాష్ట్రంలో ఉన్న 70 సీట్లలో 60 సీట్లు గెలవడమే లక్ష్యంగా పని చేస్తామని ఆయన చెప్పారు. కాగా, తాజాగా జరిగిన ఢిల్లీ కంటోన్మెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చవిచూసింది.