: షీలా దీక్షిత్ ను పక్కన పెట్టిన కాంగ్రెస్
20 ఏళ్ల పాటు ఢిల్లీ కాంగ్రెస్ బాధ్యతను భుజాన మోసిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ముందే షీలా దీక్షిత్ ఆప్ కు మద్దతు పలకడంతో పార్టీ తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో పని చేసిన షీలా దీక్షిత్ ను శాసనసభ ఎన్నికల బాధ్యతల నుంచి తప్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆమె స్థానంలో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ నేత అజయ్ మాకెన్ ను నియమించింది. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తాజా నిర్ణయంతో షీలా దీక్షిత్ పాలనపై విమర్శల వర్షం కురిపిస్తున్న ప్రతిపక్షాలకు ఓ మోస్తరు చెక్ చెప్పినట్టైంది.