: తిరుపతి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల
తిరుపతి శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. జనవరి 19న నోటిఫికేషన్ విడుదలవుతుందని ఈసీ ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు 27వ తేదీ ఆఖరి రోజు. ఫిబ్రవరి 13న పోలింగ్ జరగనుండగా... 16వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంది.