: ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సైరన్ మోగింది. ఎన్నికల షెడ్యూల్ ను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 7న పోలింగ్ జరగనుండగా... 10న ఫలితాలు వెలువడనున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 వరకు ఈసీ గడువు విధించింది. 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 15న ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ముగుస్తోంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1.30 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 11,746 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ఈసీ తెలిపింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో, ఢిల్లీలో ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి రానుంది.

  • Loading...

More Telugu News