: బ్లాక్ బాక్స్ దొరికింది... రహస్యం వీడనుంది
సురబయ నుంచి సింగపూర్ వెళ్తూ జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్స్ ను అనాలసిస్ నిమిత్తం పంపినట్టు సార్ అధికారులు తెలిపారు. బ్లాక్ బాక్స్ లో డేటా రికార్డర్, వాయిస్ రికార్డర్ అనే రెండు విభాగాలు ఉంటాయి. బాక్సుల బ్యాటరీల్లో 30 రోజుల వరకు ఛార్జింగ్, వాయిస్ రికార్డర్ లు నిల్వ ఉంటాయని అధికారులు తెలిపారు. బ్లాక్ బాక్స్ తన చుట్టూ 20 మీటర్ల పరిధిలో జరిగిన విషయాలను రికార్డు చేస్తుందని వారు వివరించారు. విమానం తోక భాగంలో ఉండే బ్లాక్ బాక్స్ లో పైలట్ల సంభాషణలు, ఇతర సమాచారం కూడా రికార్డవుతుందని వారు చెప్పారు. బ్లాక్ బాక్స్ సిగ్నళ్లు వెలువరిస్తుండడంతో అందులో సమాచారం బయటికి వస్తే, ప్రమాదానికి ముందు ఏం జరిగింది? ప్రమాదానికి కారణం ఏంటి? అనే విషయాలు వెలుగు చూస్తాయని నిపుణులు వెల్లడించారు.