: సీఎం పాత్ర పోషించి ముఖ్యమంత్రి కోరిక తీర్చుకోవచ్చు: జగన్ కు కేఈ సూచన


ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సెటైర్లు విసిరారు. ముప్పై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానన్న జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... మూడు రోజులైనా సీఎం సీటులో కూర్చోవాలని జగన్ ఆశ పడుతున్నట్టు ఉన్నారని అన్నారు. మాక్ అసెంబ్లీ పెట్టుకుని, అందులో సీఎం పాత్ర పోషించి ఆ కోరిక తీర్చుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చారు. అంతేకాకుండా, రెవెన్యూ అధికారులు, సిబ్బందికి కేఈ హెచ్చరికలు జారీ చేశారు. పాస్ పుస్తకాలు లేకుండా ఎవరైనా రిజిస్ట్రేషన్లు చేస్తే సస్పెండ్ చేస్తామని అన్నారు. రెవెన్యూ భూముల విషయంలో వీఆర్వోల అక్రమాలపై విచారణ చేపడతామని చెప్పారు. నిర్ణీత సమయంలో రైతుల దరఖాస్తులకు స్పందించని అధికారులకు జరిమా విధిస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News