: సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ
హైదరాబాద్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు వెళ్లనున్న ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ పత్యేక బస్సులు నడపనుంది. సోమ, మంగళవారాల్లో ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. కర్నూలు, అనంతపురం, కడప, ఒంగోలు, ఖమ్మం, విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయల్దేరుతాయి. నల్గొండ, మిర్యాలగూడ వైపు వెళ్లే బస్సులు దిల్ సుఖ్ నగర్ నుంచి, వరంగల్, యాదగిరిగుట్ట వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.