: అమిత్ షా కామెంట్లకు కేసీఆర్ కౌంటర్... టీఎస్ లో బీజేపీకి పుట్టగతులు కూడా లేవు
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదని... రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి ఇదే సరైన సమయమని హైదరాబాద్ పర్యటనలో ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించాల్సిందిగా కేసీఆర్ ను మీడియా ప్రతినిధులు కోరగా... ఆయన తీవ్రంగా స్పందించారు. "తెలంగాణలో టీఆర్ఎస్ కు పునాదులు లేవని వారన్నారు కదా... బీజేపీకి పుట్టగతులు కూడా లేవు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు జరిగితే తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందో, బీజేపీ గెలుస్తుందో తెలియదా? అని ప్రశ్నించారు.