: నెత్తుటి జ్ఞాపకాలు చెరుపుకుని... తిరిగి ప్రారంభమైన పెషావర్ ఆర్మీ స్కూల్!


పాకిస్థాన్ నగరం పెషావర్ లోని సైనిక పాఠశాల నెత్తుటి జ్ఞాపకాలను అతికష్టం మీద దిగమింగుకుని నేటి ఉదయం తిరిగి తన కార్యకలాపాలను ప్రారంభించింది. గత నెల 16న పాకిస్థాన్ తాలిబన్ ఉగ్రవాద సంస్థకు చెందిన తొమ్మిది మంది కరడుగట్టిన ఉగ్రవాదులు పాఠశాలలోకి చొరబడి ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 132 మంది చిన్నారులు సహా మొత్తం 140 మంది అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి అసువులు బాశారు. దాడి నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఈ పాఠశాలను మూసివేసింది. అంతేకాక పాక్ వ్యాప్తంగా పాఠశాలలు కొన్ని రోజుల పాటు మూతపడ్డాయి. అయితే చేదు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కూర్చుంటే ఎలా? తిరిగి విద్యాబోధనను ప్రారంభించాల్సిందే కదా. ఈ క్రమంలో పాఠశాలలో రక్తపు మరకలను చెరిపేసిన అధికారులు, ఉగ్రవాదుల దాడికి ధ్వంసమైన ప్రాంతాలకు మరమ్మతు చేశారు. ఈలోగా మిగిలిన పాఠశాలు కొద్దిరోజుల క్రితమే తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. తాజాగా పెషావర్ ఆర్మీ స్కూల్ కూడా నేటి ఉదయం తలుపులు తెచరుకుని తన విద్యార్థులకు పాఠాల బోధనను ప్రారంభించింది.

  • Loading...

More Telugu News