: 'గేట్ వే ఫర్ ఇండియా'గా ఏపీ మారింది: భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య సదస్సులో చంద్రబాబు
నవ్యాంధ్రప్రదేశ్ 'గేట్ వే ఫర్ ఇండియా'గా మారిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిని ఏపీలో నిర్మిస్తున్నామని చెప్పారు. 2050 నాటికి ఏపీని దేశంలోనే అగ్రస్థాయి రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య సదస్సులో ఆయన ప్రసంగించారు. మోడీ రాకతో దేశంలో కొత్త శకం ప్రారంభమయిందని చెప్పారు. కొత్త రాష్ట్రంలో వ్యాపారవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తామని... రాష్ట్రంలో ఎన్నో అవకాశాలున్నాయని, వాణిజ్య అవకాశాలకు ఏపీ పూర్తి అనుకూలమని చంద్రబాబు తెలిపారు. వచ్చే నెల ఈ-బిజ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని వెల్లడించారు. పరిశ్రమల అనుమతి కోసం సింగిల్ డెస్క్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. 7 మిషన్లు, 5 గ్రిడ్లతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.