: పిల్లి కారణంగా అపార్ట్ మెంట్లో అగ్నిప్రమాదం... పలువురికి గాయాలు


అమెరికాలో ఓ పిల్లి కారణంగా అపార్ట్ మెంట్ అంటుకుని పలువురు గాయపడిన సంఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్ లోని బ్రాంక్స్ ప్రాంతంలో నివాసముండే ఏంజెల్ అల్కజార్ అనే వ్యక్తి ఆరు పిల్లులను పెంచుకుంటున్నాడు. శుక్రవారం సాయంత్రం తన ఫ్లాట్లో పంది మాంసం వండుతుండగా మంటలు చెలరేగాయి. అతని పిల్లుల్లో ఒకటి మంటలకు సమీపంలోకి వెళ్లడంతో దానికీ మంటలు అంటుకున్నాయి. ఇక, అది అరుచుకుంటూ ఇల్లంతా పరుగులు తీసింది. దీంతో, ఇంట్లో ఉన్న వస్తువులు, దుస్తులకు కూడా మంటలు అంటుకున్నాయి. ఇక, ఆ అగ్నికీలలు మూడు, నాలుగవ ఫ్లోర్లకు కూడా వ్యాపించాయి. పాపం, ఆ పిల్లులు మొత్తం మృత్యువాత పడ్డాయట. ఆ ఘటనలో పలువురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News