: శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మహిళలు మృతి


హైదరాబాదు శివారులోని శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని భారీ కంటెయినర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. నేటి ఉదయం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అత్యల్ప ఉష్ణోగ్రతల నేపథ్యంలో అలముకున్న దట్టమైన పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News