: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ... పలు జిల్లాలకు మహిళా కలెక్టర్లు!


తెలంగాణలో 24 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం ఐఏఎస్ అధికారుల కేటాయింపును పూర్తి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత పూర్తి స్థాయి బదిలీలపై సర్కారు ఇటీవలే దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలి విడతగా 24 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు నాలుగు రోజుల వరంగల్ జిల్లా పర్యటనను ముగించుకుని వచ్చిన సీఎం కేసీఆర్ తొలి విడత బదిలీలకు పచ్చజెండా ఊపడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీశ్ శర్మ ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో మహిళా ఐఏఎస్ లు పలు జిల్లాలకు కలెక్టర్లుగా బదిలీ అయ్యారు. సమర్థవంతమైన అధికారిగా పేరుగాంచిన నవీన్ మిట్టల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News