: ఈస్టిండియా కాలం నాటి లాంతరు విక్రయిస్తూ దొరికిపోయారు
ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం నాటి లాంతరును విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడ్డారు. యాంటిక్ పీస్ గా లెక్కించే ఈ హరికేన్ లాంతరు లక్షల విలువ చేస్తుంది. అలాంటి హరికేన్ లాంతరును 10 లక్షల రూపాయలకు విక్రయిస్తున్న స్మగ్లింగ్ ముఠాను విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యులను బొబ్బిలి పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు, యాంటిక్ పీస్ ఎక్కడిదని ఆరాతీస్తున్నారు.