: క్రిష్టియన్ భవన్ పై భజరంగ్ దళ్ దాడి
మత మార్పిళ్ల నిరోధక బిల్లుపై బీజేపీ చర్చ మొదలు పెట్టిన నాటి నుంచి ఎక్కడో ఒక చోట ఉద్రిక్తత రేగుతోంది. తాజాగా, బీహార్ లో భజరంగ్ దళ్ కార్యకర్తలు స్వైరవిహారం చేశారు. బీహార్ రాజధాని పాట్నాకు 52 కిలోమీటర్ల దూరంలోని జెహనాబాద్ లోని క్రిస్టియన్ భవన్ పై దాడులు చేశారు. పేద హిందువులను క్రైస్తవమతంలోకి మారుస్తున్నారని ఆరోపిస్తూ భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేసినట్టు తెలుస్తోంది. భజరంగ్ దళ్ కార్యకర్తల ఆకస్మిక దాడులతో స్థానిక క్రైస్తవులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని వారు పోలీసులను ఆశ్రయించారు.