: ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్స్ ఆచూకీ లభ్యం


ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్స్ ఆచూకీ లభ్యమైంది. ఈ విమానం గత డిసెంబర్ 28న సురబయ నుంచి బయల్దేరి, జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. సముద్రం నుంచి విమానం తోకభాగాన్ని నిన్న వెలికి తీసిన ఎయిర్ ఏషియా అధికారులు, అదే ప్రాంతంలో బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు వెలువడడం గుర్తించారు. అయితే ఆ ప్రాంతం మొత్తం బురదమయంగా ఉందని, అందుకు బ్లాక్ బాక్స్ ను గుర్తించడం కాస్త కష్టంగా మారిందని వారు వెల్లడించారు. బ్లాక్ బాక్స్ ను గుర్తించడంతో దానిని వెలికి తీస్తామని వారు తెలిపారు. కాగా, బ్లాక్ బాక్స్ దొరికితే విమాన ప్రమాద కారణం తెలుస్తుంది.

  • Loading...

More Telugu News