: ఫేస్ బుక్ కు పెరుగుతున్న ఆదరణ


సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ కు ఆదరణ పెరుగుతోందని అమెరికాకు చెందిన పీ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో తేలింది. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫేస్ బుక్ చూసేందుకే మక్కువ చూపుతున్నారని ఆ సంస్థ పేర్కొంది. 2014వ సంవత్సరంలో 1,597 మంది ఇంటర్నెట్ వినియోగదారులతో సర్వే నిర్వహించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. సామాజిక మాధ్యమాలు అనుసరించే అమెరికా పెద్దల్లో 71 శాతం మంది ఫేస్ బుక్ చూసేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇది 2013లో 63 శాతంగా ఉందని ఫోర్బ్స్ మేగజీన్ వెల్లడించిన వివరాలను ప్రస్తావించింది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 45 శాతం మంది ఫేస్ బుక్ విరివిగా సందర్శిస్తున్నట్టు సర్వే తెలిపింది. కాగా, ట్విట్టర్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోందని ఆ సర్వే పేర్కొంది.

  • Loading...

More Telugu News