: దేశం ఉన్నంత వరకు 'స్వచ్ఛభారత్' కొనసాగుతుంది: పవన్ కల్యాణ్
'స్వచ్ఛభారత్' ఉద్యమం ఒక రోజుతో ముగిసిపోదని, దేశం ఉన్నంత వరకు కొనసాగుతుందని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. నెల్లూరులో జరిగిన స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎదిగే వయసులో ఎలా ఉండాలో స్వర్ణ భారత్ ను చూస్తే తెలుస్తుందని అన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పదవుల కోసం పాకులాడే మనిషి కాదని ఆయన తెలిపారు. సిధ్ధాంతాల కోసం కట్టుబడే వ్యక్తి వెంకయ్యనాయుడని ఆయన పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు ఆదర్శవంతమైన నాయకుడని పవన్ కల్యాణ్ చెప్పారు.