: గుంటూరు, హైదరాబాదులే నెంబర్ వన్


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హెచ్ఐవీ రోగులు పెరిగిపోతున్నారు. ఎయిడ్స్ జాబితాలో ఏపీలో గుంటూరు జిల్లా నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించగా, తెలంగాణలో హైదరాబాదుదే మొదటి స్థానమని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని ఎయిడ్స్ రోగులు అత్యధికంగా గల జిల్లాల జాబితా విడుదల చేసిన సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2013 -14 ఏడాదిలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 5,195 ఎయిడ్స్ కేసులు నమోదు కాగా, వారిలో 2,498 మహిళలని వెల్లడించింది. అలాగే తెలంగాణలోని హైదరాబాదులో 3,952 ఎయిడ్స్ కేసులు నమోదు కాగా, అందులో 2,525 మంది మహిళలతో ప్రధమస్థానంలో నిలిచిందని నివేదిక తెలిపింది. తరువాతి స్థానాల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం, చిత్తూరు, నల్గొండ, నెల్లూరు, కడప, మహబూబ్నగర్, అనంతపురం, ప్రకాశం, ఖమ్మం, కర్నూలు, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, శ్రీకాకుళం, విజయనగరం, ఆదిలాబాద్ జిల్లాలు అక్రమించాయని తెలిపింది. అయితే తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలు జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో ఆయా జిల్లాల్లో హెచ్ఐవీ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, అత్యధిక గర్భిణులకు ఎయిడ్స్ సోకిన జిల్లాగా మహబూబ్ నగర్ జిల్లా నమోదైందని సొసైటీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News