: తెలుగు ప్రజలకు, వెంకయ్యనాయుడికి సంక్రాంతి శుభాకాంక్షలు: దేవేంద్ర ఫడ్నవిస్
తెలుగు ప్రజలకు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి సంక్రాంతి శుభాకాంక్షలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. నెల్లూరులోని స్వర్ణభారతి ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ అందరికీ వెంకయ్యనాయుడు మార్గదర్శకులని అన్నారు. స్వర్ణభారతి ట్రస్టును నిజంగా స్వర్ణంలా తీర్చిదిద్దారని ఆయన పేర్కొన్నారు. యువకులు నైపుణ్యాలు పెంచుకుంటే ఉపాథి అవకాశాలు మెరుగవుతాయని ఆయన సూచించారు. కాగా, ఈ సమావేశంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.