: 'న్యూ క్రికెట్ డాన్ ఆఫ్ ఆస్ట్రేలియా'గా ఆకాశానికెత్తుతున్న మీడియా
ఆసీస్ కొత్త కెప్టెన్ స్టీవ్ స్మిత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా సిరీస్ తో ఊహించని విధంగా కెప్టెన్ గా ఎంపికైన స్టీవ్ స్మిత్, అంతకు ముందు చెప్పుకోదగ్గ విజయాలు అందించిన దాఖలాలు లేవు. అయితే తాజా సిరీస్ లో స్టీవ్ స్మిత్ అదరగొట్టేశాడు. అనూహ్యంగా కెప్టెన్సీ దక్కిన ఆనందమో, వచ్చిన అవకాశం విడిచిపెట్టకూడదన్న పట్టుదలో కానీ, స్టీవ్ స్మిత్ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ 1947-48లో నెలకొల్పిన రికార్డును సునాయాసంగా తుడిచిపెట్టేశాడు. 128.16 సగటుతో సిరీస్ లో 769 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. వరల్డ్ కప్ ముందు స్మిత్ ఇలాంటి ప్రతిభ చూపడంతో ఆస్ట్రేలియా పత్రికలన్నీ అతని ఆటతీరుపైనే చర్చిస్తున్నాయి. ఇలాగే ఆటతీరు ఉంటే ఆస్ట్రేలియా నుంచి వరల్డ్ కప్ ను ఎవరూ తీసుకెళ్లలేరని క్రీడా విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అద్భుతమైన ఫాంలో ఉన్న స్టీవ్ స్మిత్ వరల్డ్ కప్ లో ఎలా ఆడతాడో చూడాలి.