: ఈసారి జర్మనీ పత్రికా కార్యాలయం


పారిస్ లోని చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయంపై ఉగ్రదాడిని మరవకముందే జర్మనీలోని మరో పత్రికపై దుండగులు దాడికి దిగారు. జర్మనీలోని హంబర్గ్ నగరంలో గల హంబర్గర్ మోర్గాన్ పోస్ట్ కార్యాలయంపై రాళ్లు, మండే పదార్థాలతో దుండగులు దాడికి పాల్పడ్డారని స్థానిక మీడియా కధనాలు ప్రసారం చేసింది. చార్లీ హెబ్డోలో గతంలో ప్రచురించిన కార్టూన్ ను ప్రసారం చేయడంతో, పథకం ప్రకారం ఆగంతుకులు ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో, ఈ పత్రికా కార్యాలయంపై దాడికి దిగారు. కాగా, ఈ ఘటనలో కొన్ని పత్రాలు ధ్వంసం కాగా, ఎవరూ గాయపడలేదని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితులను జర్మన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News