: ప్రేమోన్మాది ఘాతుకం... దేహశుద్ధి చేసిన స్థానికులు


ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. మెదక్ జిల్లా సిద్ధిపేటలోని కళాశాలలో చదువుతున్న ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ ఓ యువకుడు రోజూ వెంటపడేవాడు. అయితే, యువతి అతడి ప్రేమను తిరస్కరిస్తూ వస్తోంది. దీంతో తనను ఎందుకు ప్రేమించవంటూ ఆ యువతిపై ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించేందు ప్రయత్నించాడు. దీంతో, స్థానికులు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఏం చేస్తున్నావంటూ ఆరా తీసిన స్థానికులు, అతడు చెప్పింది విని తగిన శాస్తి చేశారు. అతడికి బుద్ధి వచ్చేలా చావబాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News