: మోదీని ఆకాశానికెత్తేసిన కుమారమంగళం బిర్లా


ఉజ్వల గుజరాత్ సదస్సులో పాల్గొన్న ఆదిత్యా బిర్లా గ్రూప్ అధినేత కుమారమంగళం బిర్లా భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తేశారు. మోదీ ఒక విజన్ గల నేత అని కొనియాడారు. ప్రపంచ చిత్రపటంలో భారత్ ను ఉజ్వల స్థాయికి తీసుకెళ్లడానికి మోదీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారని... ఆయన నాయకత్వంలో భారత్ దూసుకుపోతుందని చెప్పారు. వేగవంతమైన నిర్ణయాలు, మెరుగైన పాలనలే మోదీ ఆయుధాలని కీర్తించారు. స్పష్టమైన విధానాలు, హై స్పీడ్ కార్యనిర్వహణను మనం గుజరాత్ లో చూడవచ్చని తెలిపారు. తమ సంస్థ పెట్టుబడులకు గుజరాత్ అత్యంత కీలకమైన రాష్ట్రమని అన్నారు.

  • Loading...

More Telugu News