: 'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సుకు హాజరైన మోదీ, బాన్ కీ మూన్, జాన్ కెర్రీ
గుజరాత్ లోని గాంధీనగర్ లో 'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ, ప్రపంచ బ్యాంక్ సుప్రీమో జిమ్ యాంగ్ కిమ్ హాజరయ్యారు. అంతేకాకుండా దేశ, అంతర్జాతీయ టాప్ 50 సంస్థల సీఈవోలు ఈ సదస్సుకు కదలి వచ్చారు. భారత్ కు చెందిన పారిశ్రామికవేత్తలలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ, ఆదిత్యా బిర్లా గ్రూప్ అధినేత కుమారమంగళం బిర్లా తదితరులు హాజరయ్యారు.