: సంక్రాంతి వరకు కొనసాగనున్న చలి తీవ్రత
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో... ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికన్నా తక్కువగా నమోదవుతున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఎలాంటి అలజడులు లేకుండా, ప్రశాంతగా ఉండటం కూడా చలి పెరగడానికి మరో కారణమని తెలిపింది. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో చలితీవ్రత సంక్రాంతి పండుగ వరకు కొనసాగుతుందని ప్రకటించింది. సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.