: లంబసింగిలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత... హైదరాబాద్ లో పది డిగ్రీలు
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. విశాఖ మన్నెంలోని లంబసింగిలో కనిష్ఠ ఉష్ణోగ్రత ఏకంగా సున్నా డిగ్రీలకు పడిపోయింది. చింతపల్లిలో 3 డిగ్రీలు, పాడేరులో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో, మన్నెం ప్రాంత ప్రజలు గజగజ వణుకుతున్నారు. మరోవైపు రాజధాని నగరం హైదరాబాదులో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. గత రాత్రి 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో, తెల్లవారుజామున బయటకు రావడానికి జంకిన నగరవాసులు, ఇంటికే పరిమితమయ్యారు.