: ప్రారంభమైన కంటోన్మెంట్ ఎన్నికలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఎనిమిది వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు 144 సెక్షన్ ను విధించారు. మొత్తం 114 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1,68,063 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎల్లుండి ఓట్ల లెక్కింపు జరగనుంది.