: ముస్లిం మహిళలు బురఖా ధరించడాన్ని నిషేధించిన చైనా


దేశ శ్రేయస్సు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో చైనా ఏమాత్రం వెనుకడుగు వేయదన్నది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా, బురఖాలను నిషేధిస్తూ చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిన్ జియాంగ్ రాష్ట్ర రాజధాని నగరం యురుంఖీలో... ముస్లిం మహిళలు బురఖాలను ధరించరాదంటూ నిన్న ఆదేశాలు జారీ చేసింది. యురుంఖీలో వేర్పాటువాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికే ఈ నిర్ణయం తీసుకుంది. బురఖాలు ముస్లిం మహిళల సంప్రదాయ దుస్తులు కావని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేక జిన్ జియాంగ్ కోసం ఈ మధ్య కాలంలో 'ఈస్ట్ తుర్కిస్థాన్ ఇస్లామిక్ మూవ్ మెంట్' దాడులు పెరిగి పోయాయి. ఈ నేపథ్యంలో, ఉగ్రవాద ప్రేరేపిత సమాచారం ఉన్న వెబ్ సైట్లను కూడా చైనా నిషేధించింది. ఆఫ్ఘనిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దులోని అల్ కాయిదా మద్దతుతో ఈస్ట్ తుర్కిస్థాన్ ఇస్లామిక్ మూవ్ మెంట్ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News