: భార్య పబ్ కు వెళ్లినంత మాత్రాన విడాకులు ఇవ్వలేం: హైకోర్టు


"పిల్లల గురించి నా భార్య పట్టించుకోవడం లేదు. దురుసుగా ప్రవర్తిస్తోంది. పబ్ లకు వెళుతోంది. నన్ను కూడా కొట్టింది. వేడి టీ నా మొహాన కొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో నా భార్యతో కలసి బతకలేను. విడాకులు మంజూరు చేయండి"... ఇది, ఓ భర్త తన భార్య నుంచి విడాకులు మంజూరు చేయాలంటూ బొంబాయి హైకోర్టుకు పెట్టుకున్న పిటిషన్. దీన్ని విచారించిన హైకోర్టు... భార్య పబ్ లకు వెళ్లడం తీవ్రమైన నేరం కాదని, పైన పేర్కొన్న కారణాలతో విడాకులు మంజూరు చేయలేమని తీర్పు ఇచ్చింది. అంతకు ముందు ఇదే కేసులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ జంటకు 20 ఏళ్ల క్రితం పెళ్లికాగా, కేవలం నాలుగేళ్లు మాత్రమే కలిసున్నారు. వీరికి ఒక కూతురు ఉండగా... తండ్రి వద్దే ఆమె పెరుగుతోంది.

  • Loading...

More Telugu News