: తార్నాకలోని బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్, తార్నాక వద్ద ఉన్న పావని టవర్స్ లో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. టవర్స్ లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సోర్స్-1 సొసైటీ అనే ఇన్స్టిట్యూట్ లో కంప్యూటర్లు, ఫర్నిచర్ దగ్ధం అయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.