: 'లింగా' నిర్మాత ఏడ్చారు


సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లింగా సినిమా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. 'లింగా సినిమాపై రెండు రాష్ట్రాల మధ్య రాజకీయాలు చేయవద్దు' అని ఆయన సూచించారు. రజనీకాంత్ తనకు మంచి మిత్రుడని, అందుకే కన్నడ వ్యక్తినైనప్పటికీ తనతో సినిమా చేశారని లింగా సినిమా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తెలిపారు. కాగా, లింగా' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా తాము భారీగా నష్టపోయామని, రజనీకాంత్ జోక్యం చేసుకుని, నిర్మాతతో మాట్లాడి నష్టపోయిన మొత్తం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ, పంపిణీదారులు నిరాహార దీక్ష మొదలు పెట్టారు. దీంతో తమ మధ్య విభేదాలు రేపవద్దంటూ రాక్ లైన్ వెంకటేష్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News