: మా జట్టులో ఉడుకుమోతులు ఎక్కువ: కెవిన్ పీటర్సన్
ఇంగ్లాండ్ జట్టుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. అవకాశం దొరికిన ప్రతిసారి తన జట్టులోని ఆటగాళ్ల మనస్తత్వాన్ని విమర్శించే కెవిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ జట్టులోని ఆటగాళ్లకు తానంటే అసూయ అని అన్నారు. సహ ఆటగాళ్ల వల్ల తాను బలయ్యానని చెప్పారు. వివాదాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న కెవిన్, తన ఆత్మ కథలో కూడా సహచరులపై విమర్శలు గుప్పించాడు. ఆసీస్ లోని బిగ్ బాష్ లీగ్ లో పాల్గొన్న సందర్భంగా కేపీ మాట్లాడుతూ, ఇక్కడ అసూయపడే ఆటగాళ్లు ఎవరూ లేరని, అదే ఇంగ్లండ్ లో అయితే అసూయపడేవాళ్లకు కొదవేలేదని పేర్కొన్నాడు.